September 24, 2025 |
Category: Politics
219 views
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రికార్డు స్థాయిలో 1.25 కోట్ల రూపాయల నుండి 1.50 కోట్ల రూపాయల ప్రమాద బీమా పథకం అమలు
సింగరేణి సంస్థ ఉద్యోగులు ,కార్మికులకు ప్రమాదంలో మరణిస్తే బాధితులకు కోటి రూపాయలు బీమా అందించే విధంగా బీమా సంస్థలతో ఒప్పందం కుదురుచుకుంది. దీని స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రికార్డు స్థాయిలో రూ. 1.25 కోట్ల రూపాయల నుండి రూ. 1.50 కోట్ల రూపాయల ప్రమాద బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నది. బ్యాంకులో ఉన్న శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ ప్రమాద, బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.
ఎస్బిఐ బ్యాంకులో సాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి బ్యాంకు కోటి రూపాయల బీమా చెల్లిస్తుంది. విమాన ప్రమాదంలో మరణిస్తే ఒక కోటి 60 లక్షల రూపాయలు, ఊపే డెబిట్ కార్డు ఉంటే మరో కోటి చెల్లిస్తుంది.