Grama Vani

చే గువేరా యువ హృదయాలకు ఆదర్శం :ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కమిటీ

Featured

October 9, 2025 | Category: Politics
56 views

ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేగువేరా 58 వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ ఏరియా కమిటీ ఆఫీస్ లో చేగువేరా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది

చే గువేరా యువ హృదయాలకు ఆదర్శం :ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కమిటీ

జహీరాబాద్:ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేగువేరా 58 వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ ఏరియా కమిటీ  ఆఫీస్ లో చేగువేరా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా  కార్యదర్శి టీ రాజేష్ మాట్లాడుతూ.అక్టోబర్ 9, ప్రపంచ విప్లవకారుడు, సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఎర్నెస్టో "చే" గువేరా యొక్క వర్ధంతి. 1967లో ఈ రోజున బొలీవియాలో ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు, కానీ ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, మరియు సామాజిక న్యాయం కోసం పోరాటం ఈ రోజూ ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి యువతకు స్ఫూర్తినిస్తూనే చే గువేరా అన్నారు.
ఒక వైద్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ, లాటిన్ అమెరికా మరియు ప్రపంచవ్యాప్తంగా అణగారిన వర్గాల స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. క్యూబా విప్లవంలో కీలక పాత్ర పోషించిన చే, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేశారు. ఆయన జీవితం యువతకు, సమాజంలో మార్పు కోసం పనిచేయాలనుకునే వారికి ఒక స్ఫూర్తిదాయక విప్లవకారుడు చే యొక్క త్యాగాన్ని, ఆదర్శాలను స్మరించుకుంటూ, సమాజంలో అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని అదేవిధంగా ఆయన స్ఫూర్తితో, సమానత్వం, న్యాయం, మరియు మానవ హక్కుల  యువత సమాజ మార్పు కోసం ఈ ప్రభుత్వాలపై పోరాటం చేయవలసిన అవసరం ఉందని వారన్నారు .ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్ , కృష్ణ, సాయి గౌడ్, కోటి రెడ్డి, అభి, చిన్న,రిషి, సందీప్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు