Grama Vani

చేగువేరా జీవితం నేటి యువతరానికి ఆదర్శం...

Featured

October 9, 2025 | Category: Zaheerabad
96 views

చేగువేరా స్ఫూర్తితో యువకుల సమస్యలపై ఉద్యమాలు... చేగువేరా జీవితం నేటి యువతరానికి ఆదర్శం డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు తిరుపతి.

చేగువేరా జీవితం నేటి యువతరానికి ఆదర్శం...

ప్రపంచ యువతేజం యువకుల ఆదర్శనేత చేగువేరా ప్రపంచానికి ప్రపంచ యువతకు ఆదర్శంగా నిలిచాడని ,చేగువేరా స్ఫూర్తితో యువకుల సమస్యలపై డివైఎఫ్ఐ పనిచేస్తుందని చేగువేరా వారసత్వాన్ని కొనసాగిస్తుందని ,చేగువేరా స్ఫూర్తితో మరిన్ని యువజన ఉద్యమాలు చేపడతామని DYFI జహీరాబాద్ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు తిరుపతి అన్నారు. ఈ రోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేగువేరా వర్ధంతి సందర్భంగా చేగువేరా చిత్ర పతన పూలమాలవేసి నివాళులర్పించి శ్రీకాంత్,తిరుపతిలు మాట్లాడుతూ క్యూబా విప్లవంలో కీలక పాత్ర పోషించిన చేగువేరా నేటి విద్యార్థి యువజనలకు పెద్ద ఆదర్శనీయమని ఆయన స్ఫూర్తితో మరిన్ని  యువజన ఉద్యమాలు నిర్మిస్తామని, అన్ని రంగాలలో యువత అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్వర్ , మహేష్, వినోద్ ఉన్నారు.