September 24, 2025 |
Category: Politics
466 views
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈనెల 26 ,27వ తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు
బంగాళాఖాతంలో వాయుగుండం తెలంగాణలో అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈనెల 26 ,27వ తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి ,ములుగు ,వరంగల్ ,హనుమకొండ, జనగామ ,యాదాద్రి భువనగిరి ,సిద్దిపేట ,వికారాబాద్ , మెదక్,సంగారెడ్డి ,కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. 27న కొమరం భీమ్ ఆసిఫాబాద్ ,ఆదిలాబాద్ ,నిర్మల్ ,నిజామాబాద్, వికారాబాద్ సంగారెడ్డి ,మెదక్ ,కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడనున్నాయి .