Grama Vani

రాయికోడ్ మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

Featured

September 30, 2025 | Category: Raikode
61 views

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం లోని వివిధ గ్రామాలలో సోమవారం రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.

రాయికోడ్ మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం లోని వివిధ గ్రామాలలో సోమవారం రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.మహిళలు ఉదయాన్నే లేచి కలాపి చల్లుకొని, పిడివంటలు చేసుకొని పురుషులు తెచ్చిన తంగేడు,గునగ బంతి,చామంతి పువ్వులతో అందంగా బతుకమ్మలు పేర్చి, సాయంత్రం సంప్రదాయ దుస్తువులలో మహిళందరు ఒక చోట చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చప్పట్లతో, చుట్టూ తిరుగుతూ,పిల్లలు కోలాటలతో, డీజే పాటలతో నృత్యలు చేస్తూ పండుగను జరుపుకోవడం జరిగింది.సాయంత్రం సంధ్య వేళలో బతుకమ్మలను ఊరి శివారులో ఉన్న చెరువులో బతుకమ్మలను నిమ్మజ్జనం చేయడం జరిగింది. వెంట తెచ్చుకున్న సద్దులను తిని ఇండ్లలోకి చేరుకోవడం జరిగింది.

                                                                 https://youtu.be/9djUUD8VY60?si=_yN5sUSN6h2N575d

Tags: raikode