October 9, 2025 |
Category: Zaheerabad
60 views
మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి... సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కార్యాలయంలో వినతి.
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు తక్షణమే రెండు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా విధులు బహిష్కరించి ,ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కార్యాలయంలో కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహిపాల్ మాట్లాడుతూ ,నిత్యం అనేక మురికి పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికులకు కూడా కనీసం నెల నెలా వేతనాలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఏం లాభమని, కనీసం కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన దసరాకు కూడా కనీసం వేతనాలు ఇవ్వలేదని, ఇప్పుడు వస్తున్న దీపావళికి కూడా వేతనాలు ఇస్తారా లేదా అని ప్రశ్నించారు. తక్షణమే వేతనాలు ఇవ్వాలని లేనిపక్షంతో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. రెండు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. మున్సిపల్ నుండి ట్రెజరీకి చెక్స్ పంపినాక నెలలు గడుస్తున్నా ప్రభుత్వం అప్రూవల్ చేయక పోవడం సరైనది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంజీవ్ మోహన్ పున్నెమ్మ, సిద్ధమ్మ, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.