Grama Vani

ఉస్మానియా అనుబంధ ఆసుపత్రులలలో వైద్య సేవల బలోపేతం పై ఉన్నత స్థాయి సమీక్ష.

Featured

September 17, 2025 | Category: Politics
110 views

* ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో వైద్య సేవల బలోపేతం పై సుదీర్ఘ చర్చ .

ఉస్మానియా  అనుబంధ ఆసుపత్రులలలో వైద్య సేవల బలోపేతం పై ఉన్నత స్థాయి సమీక్ష.

* ఆసుపత్రి లోని పాత భవనాల పరిస్థితి పై క్షేత్ర స్థాయి లో పర్యటించి తక్షణమే నివేదిక సమర్పించాలని మంత్రి TGMSIDC ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం .* ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ కు హెల్త్ హబ్ బ్రాండ్ గా ఉస్మానియా డాక్టర్లు  గుర్తింపు తెచ్చారన్నారు.

ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులలలో వైద్య సేవల బలోపేతం పై రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా SR నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ కార్యాలయం  లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు .

ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబందంగా ఉస్మానియా హాస్పిటల్‌తో పాటు, నీలోఫర్ హాస్పిటల్, సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్, టీబీ అండ్ చెస్ట్‌ హాస్పిటల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్,  సుల్తాన్‌ బజార్ మెటర్నిటీ హాస్పిటల్, పెట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్, ఈఎన్‌టీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ లు అనుబంధంగా విశేష వైద్య సేవలను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉస్మానియా హెల్త్ హబ్ గా , బ్రాండ్ గా ఉస్మానియా డాక్టర్లు  గుర్తింపు తెచ్చారన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహా . ఉస్మానియా అనుబంధ ఆసుపత్రులలో వైద్య సేవల బలోపేతానికి చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులను ఆదేశించారు .

ఈ సమీక్షలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆసుపత్రి లో వైద్య సేవల బలోపేతం పై సుదీర్ఘంగా చర్చించారు . ఆసుపత్రి లోని పాత భవనాల పరిస్థితి పై క్షేత్ర స్థాయి లో తక్షణమే పర్యటించి వచ్చే రెండు , మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని TGMSIDC ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు .

ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ఆసుపత్రి లో మౌలిక సదుపాయాల కల్పన , HR , ఎక్విప్ మెంట్లు రిపేర్లు , R O  వాటర్ ప్లాంట్ , శానిటేషన్ , డ్రైనేజీ సిస్టం , ఇన్ఫ్రా , అంతర్గత రోడ్లు , రోగుల కు అవసరమైన సౌకర్యాల కల్పన కు పెద్దపీట వేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం OP , IP సేవల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు .  

ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశించారు . ఉస్మానియా బ్రాండ్ ఇమేజ్ కు అనుగుణంగా వైద్య సేవలు అందించేందుకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు వైద్య శాఖ అధికారులు కృషి చేయాలన్నారు.

సరోజినీ దేవి కంటి హాస్పిటల్ పై మంత్రి దామోదర్ రాజనర్సింహా చర్చించారు . ఆధునిక కాలానికి అనుగుణంగా ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కు పెద్దపీట వేయాలన్నారు . OP , IP , ఎక్విప్ మెంట్స్ రిపేర్లు,  సాంకేతిక సిబ్బంది ,  డాక్టర్లు , నర్సింగ్ సిబ్బంది , ఉన్న పాత  భవనాల పరిస్థితి పై చర్చించారు .

ఈ సమీక్ష లో హెల్త్ సెక్రటరీ డా క్రిస్టినా , DME డా . నరేంద్ర కుమార్ , ఉస్మానియా అనుబంధ మెడికల్ కాలేజీ ల HoD లు పాల్గొన్నారు .