రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా,కేంద్ర మంత్రి బండిసంజయ్ అమీర్ పేట లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిశీలిన
September 17, 2025 |
Category: Politics
87 views
AMEERPEWT COMMUNITY HEALTH CENTRE
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్ - అమీర్ పేట లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారితో కలసి పరిశీలించారు . హాస్పిటల్ లోని అన్ని విభాగాలు తిరిగి చికిత్స పొందుతున్న రోగులతో కలసి మాట్లాడారు . హాస్పిటల్ లో అందిస్తున్న వైద్య సేవలు , చికిత్సలపై మంత్రి దామోదర్ రాజనర్సింహా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం PLAN INTERNATIONAL సంస్థ అద్వర్యం లో నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంపు ను ప్రారంభించారు . బ్లడ్ డోనార్ లకు సర్టిఫికెట్స్ లను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారితో కలసి అందించారు . ఆసుపత్రి మెడికల్ సూపరింటెoడెంట్ తో ఆసుపత్రి లో మెరుగైన వైద్య సేవల బలోపేతం పై చర్చించారు . క్యాడర్ స్ట్రెంత్ , ప్రస్తుతం సిబ్బంది , డాక్టర్లు , నర్సింగ్ సిబ్బంది , రోగుల IP , OP పై చర్చించారు . ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన పై చర్చించారు . ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా మెడికల్ సూపరింటెoడెంట్ ను ఆదేశించారు .
ఈ కార్యక్రమం లో MLC అడ్డంకి దయాకర్ , హెల్త్ సెక్రటరీ డా . క్రిస్టినా , DME డా . నరేంద్ర కుమార్ , TVVP కమిషనర్ డా . అజయ్ కుమార్ , డైరెక్టర్ హెల్త్ డా . రవీంద్ర కుమార్ , ఇతర వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు .