October 9, 2025 |
Category: Politics
49 views
జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఝరసంఘం మండలానికి చెందిన ముఖ్య నాయకులతో కార్యకర్తలతో గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు .
జహీరాబాద్ :ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలకు బట్ట బయలు చేస్తామని మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం మరోసారి ప్రజలు మోసపోకుండా వారి మోసాలు ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి నాయకులు కార్యకర్తలుకు తెలియజేయాలన్నారు.అనంతరం బర్దిపూర్ గ్రామ మాజీ సర్పంచ్ , బిజెపి నాయకులు కృష్ణ , ఎల్లన్న, నాగన్న మాజి టెంపుల్ డైరెక్టర్, బస్వరాజ్ తదితరులు బి ఆర్ ఎస్ పార్టీ లోకి చేరారు ,వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మాణిక్ రావు గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారు.ఈ కార్యక్రమంలో గ్రామాల మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ లు,గ్రామ పార్టీ అధ్యక్షులు,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
