October 9, 2025 |
Category: Politics
47 views
బహుజనులకు రాజ్యాధికారం పితామహుడు మాన్య శ్రీ కాన్షీరాం గారు :పీపాడ్ పల్లి మోహన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
సంగారెడ్డి జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పీపాడ్ పల్లి మోహన్ అధ్యక్షతన బహుజన్ సమాజ్ పార్టీ (BSP) స్థాపకులు, BAMCEF, DS4 మరియు BSP వ్యవస్థాపకులు అయిన మాన్యవర కాన్షీరాం జీ గారి 19వ వర్ధంతి సెమినార్ జిల్లా ఆఫీస్ లో జరిగింది ఈ సెమినార్ ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. కోఆర్డినేటర్ బాలన్న గారు మరో రాష్ట్ర నాయకులు గైని గంగాధర్ గారు.. హాజరై మాన్య శ్రీ కాన్షీరాం గారు చేసిన త్యాగాలు, సేవలు, మరియు బహుజనుల సాధికారత కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ ఒక సెమినార్ నిర్వహించడం జరిగింది.
డా.బి.ఆర్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాధికార సాధన కోసం మాన్యవర్ కాన్షీరామ్ బీఎస్పీని స్థాపించారు. మహాత్మా పూలే, అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో పోరాడుతున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలను రాజ్యాధికారం రుచి చూపించారు .ఈ దేశంలో వేల ఏళ్లుగా అవమానాలకు గురవుతున్న జాతులకు ఆత్మగౌరవం దక్కాలంటే రాజ్యాధికారం దక్కాలి.రాజ్యాధికారం దక్కనంతకాలం మన జాతులకు అవమానాలు, అణిచివేతలు, దాడులు తప్పవు అని,ఉత్తర్ ప్రదేశ్ లో రాజ్యాధికారం దక్కేలా కృషి చేశారు. బెహన్ కుమారి మాయావతి గారిని ముఖ్య మంత్రి చేసి, మనువాదులతో అహర్నిశలు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు . అందుకే ఎన్నికలు ఏవైనాఏనుగు గుర్తుకు ఓట్లేసి,బీఎస్పీని గెలిపించి మాన్యవర్ కాన్షీరాం గారి కలలను సాకారం చేద్దాం అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ డప్పు ప్రేమ్ కుమార్. మాజీ జిల్లా అధ్యక్షులు శశికాంత్.. బంసెఫ్ అధ్యక్షులు అనంతయ్య ,పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీశైలం గారు,ఇంచార్జి వినయ్ కుమార్ గారు,నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పండరి,ఇంచార్జి బీమన్నా గారు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు దావీదు గారు ఇంచార్జి కృష్ణ గారు ,జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గఅధ్యక్షులు ఇంచార్జి సతీష్ మరియు సుధీర్...ఆయా మండల ల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
