September 17, 2025 |
Category: Politics
53 views
ప్రతి నిర్మాణం వెనుక శ్రమజీవి శక్తి ఉంది: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వ శిల్పిగా, దేవ శిల్పిగా మహానగరాలను సృష్టించిన మహోన్నత కర్తగా ఆరాధించబడుతున్న శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ గారి యజ్ఞ మహోత్సవం ( జయంతి ) వేడుకలను బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా , జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య , జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కలిసి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి యజ్ఞ మహోత్సవం లో పాల్గొన్నారు .
ఈ సందర్భముగా మంత్రి మాట్లాడారు ---- విశ్వకర్మ భగవాన్ మనకు సృజనాత్మకత, శిల్పకళ, కర్మనిష్ఠకు ప్రతీక. ఇంజనీర్లు, కళాకారులకు ఈ రోజు ప్రత్యేక మైన రోజు . భగవాన్ విశ్వకర్మను సృష్టికి మొదటి శిల్పి ,వాస్తుశిల్పిగా భావిస్తారు. నిర్మాణం, వాస్తుశిల్పం, శిల్పకళ, సాంకేతిక నైపుణ్యాల దేవుడిగా పరిగణిస్తారని తెలిపారు .విశ్వకర్మ పూజ రోజును శిల్పులు, ఇంజనీర్లు, కళాకారులు సాంకేతిక రంగంలో పనిచేసే వ్యక్తులకు ప్రత్యేకంగా భావిస్తారు. విశ్వకర్మ జయంతి రోజున ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు , పరిశ్రమల్లో వడ్రంగి నుంచి స్వర్ణకారుడు, కమ్మరి, మేస్త్రి, శిల్పి, పూజలు చేస్తారు. ఆయన సృష్టించిన దివ్య నిర్మాణాలు, శిల్పాలు మనకు మార్గదర్శకాలు. కార్మికులు, శిల్పులు, వృత్తిదారులు విశ్వకర్మ సంప్రదాయ వారసత్వాన్ని కొనసాగిస్తూ, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి వృత్తిదారునికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించడానికి కట్టుబడి ఉంది. సంక్షేమ పథకాల ద్వారా విశ్వకర్మ వర్గాల అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తుంది మంత్రి పేర్కొన్నారు .
జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ – “విశ్వకర్మ జయంతి అనేది వృత్తిదారుల, శిల్పకారుల పండుగ. సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర అత్యంత విలువైనది. ముఖ్యంగా నిర్మాణ రంగం, యంత్రాల తయారీ రంగాల్లో పనిచేసే కార్మికుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఇంటి, ప్రతి నిర్మాణం వెనుక శ్రమజీవి శక్తి ఉంటుంది. అలాంటి వృత్తిదారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, యంత్రాల తయారీ రంగాల్లో పనిచేసే కార్మికుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి నిపెంపొందించుకోవాలని , వృత్తులను గౌరవించుకోవాలి. విశ్వకర్మ ఆత్మవిశ్వాసం, అందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు.
టి.జి.ఐ.ఐ.సి చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి మాట్లాడుతూ – విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం శిల్పులు, కార్మికులు, కూలీలు, సాంకేతిక రంగంలో పని చేసే వారు అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. విశ్వకర్మ వృత్తిదారులు, శిల్పులు, కళాకారులు సమాజ నిర్మాణానికి మూలస్తంభాలు. వారికి అవసరమైన సౌకర్యాలు, మార్కెట్ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యం. విశ్వకర్మ జయంతి స్ఫూర్తితో అందరూ కృషి, నైపుణ్యాలను పెంపొందించుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ ,మాధురి , జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జగదీష్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య , ప్రజా ప్రతినిధులు, అధికారులు ,విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు .