Grama Vani

ప్రధాని మోడీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తరాఖండ్ ఉపాధ్యాయులు

Featured

September 27, 2025 | Category: India
73 views

బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినారు.

ప్రధాని మోడీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తరాఖండ్ ఉపాధ్యాయులు

బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినారు. బదిలీలు, పదోన్నతులు ,పాత పెన్షన్ పథకం అంటే సుమారు 34 డిమాండ్లతో గత నెల రోజులుగా తాము నిరసన తెలుపుతున్న ,రాష్ట్ర సర్కార్ స్పందించడం లేదంటూ ఓ టీచర్ ప్రధానికి రక్తంతో లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. చంపావతి జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ సభ్యుడు రవి బాగోటి ఈ లేఖ రాశారు ,రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది ఉపాధ్యాయులు ప్రధానికి లేఖలు రాసినట్లు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ అధ్యక్షుడు రాంసింగ్ చౌహాన్ తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనేతరా విధుల్ని బహిష్కరించి బోధన మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి కారణంగా తమ డిమాండ్లపై ప్రధాని జోక్యం కోరుతున్నట్లు తెలిపారు