September 27, 2025 |
Category: State
48 views
అక్టోబర్ 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు, డిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి పరిశీలకులకు సమర్పిస్తారు.
అక్టోబర్ నెలాఖరు వరకు... పూర్తి కానున్న డిసిసి అధ్యక్షుల నియామకాలు
అక్టోబర్ 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు, డిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను ఏఐసిసి పరిశీలకులకుసమర్పిస్తారు..
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను కలిశాను.తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కు వివరించారు.అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణ లో డిసిసి అధ్యక్షుల నియామకం పూర్తవుతుంది.జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఖర్గే ఆదేశించారు.క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కునే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్గేశించారు.సంస్థాగత పునర్నిర్మాణం పగద్బందీగా, ఏ గ్రూపు వత్తిడి కి లొంగకుండా పనిచేయాలన్నారు.అక్టోబర్ 4 వ తేదీ నుంచి ఏఐసిసి పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు.అక్టోబర్ 15 వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు, డిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను ఏఐసిసి పరిశీలకులు సమర్పిస్తారు.అక్టోబర్ నెలాఖరు కల్లా డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుంది అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు .