Grama Vani

మా ఛాంపియన్‌కు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

Featured

September 15, 2025 | Category: Sports
55 views

లండన్‌: వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్ సాధించి నారా దేవాంశ్‌ ప్రపంచ రికార్డ్ అందుకున్నారు.

మా ఛాంపియన్‌కు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

లండన్‌: వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్ సాధించి నారా దేవాంశ్‌ ప్రపంచ రికార్డ్ అందుకున్నారు. ఈ మేరకు లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల వేడుకలో దేవాంశ్‌కు నిర్వాహకులు అవార్డును ప్రదానం చేశారు. గతేడాది చెక్‌మేట్ మారథాన్‌లో 175 చెక్‌మేట్ సవాళ్లను పరిష్కరించి దేవాంశ్‌ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. చెస్ డొమైన్‌లో గతంలోనూ మరో రెండు రికార్డులు సాధించారు. దేవాంశ్‌ సాధించిన ఈ ఘనత ఎంతో గర్వకారణమని అతడి తండ్రి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌  హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెడుతూ, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాంశ్‌ చెస్ నేర్చుకున్నాడని చెప్పారు. అతడి కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం చూసి ఎంతో ఆనందిస్తున్నానని చెప్పారు.